జనరల్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ల పోస్టులు! 12 d ago
ముంబయిలోని జనరల్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీఐ) లో 110 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. మొత్తం ఉద్యోగాల్లో జనరల్ అభ్యర్ధులకు 43, ఎస్సీలకు 15, ఎస్టీలకు 11, ఓబీసీలకు 34, ఈడబ్ల్యూఎస్‌లకు 7 కేటాయించారు. జనరల్, లీగల్, హెచ్ఆర్, ఇంజినీరింగ్, మెడికల్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
జనరల్ (18) 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, పీజీ/ ఎంబీఏ చదివినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
లీగల్(9) 60 శాతం మార్కులతో లా డిగ్రీ చేయాలి. బార్ కౌన్సిల్‌లో నమోదైవుండాలి. ఎల్ఎల్ఎం/ సివిల్ లా /సైబర్ లా / అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
హెచ్ఆర్ (6) 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, హెచ్ఆర్ఎం/ పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేయాలి.
ఇంజినీరింగ్(5) 60 శాతం మార్కులతో సివిల్/ఏరో నాటికల్/ మెరైన్ /మెకానికల్/ఎలక్ట్రికల్ బీఈ/బీటెక్ పూర్తి చేయాలి. ఎంఈ/ఎంటెక్/ఎంఎస్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం.
ఐటీ(22) కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. పీజీ/సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్/ అనుభం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
యాక్చువరీ(10) ఏదైనా డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ సొసైటీ ఆఫ్ ఇండియా/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ యాక్చువరీస్, లండన్ నుండి ఏడు పేపర్లు పాసవ్వాలి.
ఇన్సురెన్స్ (20) 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, జనరల్ ఇన్సురెన్స్ రిస్క్ మేనేజ్‌మెంట్/ లైఫ్ ఇన్సురెన్స్/ ఎఫ్ఐఐఐ/ఎఫ్‌సీఐఎల్‌లో తప్పనిసరిగా పీజీ డిగ్రీ/డిప్లొమా ఉండాలి.
మెడికల్ ఎంబీబీఎస్ (2) 60 శాతం మార్కులతో ఎంబీబీఎస్ డిగ్రీ, ఇటర్న్‌షిప్ పూర్తిచేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో రిజిస్టరవ్వాలి.
ఫైనాన్స్(18) బీకాం 60 శాతం మార్కులతో పాసై, ఎంబీఏ ఫైనాన్స్/సీఎఫ్ఏ/సీఏ/ సీఎంఏ/ ఎంకాం పూర్తి చేసిన వారికి ప్రాధాన్యమిస్తారు.
ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే చాలు. అన్ని పోస్టులకూ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. ఎంపికైన వారిని ముంబయిలో నియమిస్తారు. అభ్యర్ధుల వయసు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, జనరల్ ఇన్సురెన్స్ సంస్ధ ఉద్యోగులకు ఎనిమిదేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ పరీక్ష, బృంద చర్చలు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జనవరి 5 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయాలి.